జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి ల ఆదేశాల మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘నేను సైతం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ సమక్షంలో వెంకటసాయి ట్రేడర్స్ సహకారంతో రెండు సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. వ్యాపారులు తమ పరిసరాల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేర రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వెల్గటూర్‌లో ‘నేను సైతం’ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు
RELATED ARTICLES



