📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి విద్యార్థులపై లాఠీ చార్జ్...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి విద్యార్థులపై లాఠీ చార్జ్ ఖండిస్తున్నాం

📰 Generate e-Paper Clip

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి!
విద్యార్థులపై లాఠీ చార్జ్ ఖండిస్తున్నాం!

ప్రజావాణి శాయంపేట

మండల కేంద్రంలో బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేస్తున్నటువంటి నిట్ విద్యార్థులపై చేసిన లాఠీ చార్జ్ నీ ఖండిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం బిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పేపర్ లీకేజీలు చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ను ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం విద్యార్థులతోని మరియు రైతులతోని ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని వాపోయారు.  దేశమంతా విద్యార్థుల పక్షాన నిలబడితే బిజెపి ప్రభుత్వం మాత్రం రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని తెలిపారు. విద్యార్థులే ఈ దేశానికి భవిష్యత్తు అని, విద్యార్థులు లేని ఈ దేశం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడం మర్చిపోయిందని, సొంత లాభాల కోసం, దేశ భవిష్యత్తును నాశనం చేయడం లక్ష్యంగా పరిపాలిస్తుందని తెలిపారు. శాంతియుత ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ర్యాలీని వారి డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం  ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేపల్లి విజయ్ కుమార్, శాయంపేట మండల అధ్యక్షులు మారపల్లి సుధాకర్, నాయకులు అల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.