📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyశాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

📰 Generate e-Paper Clip

*శాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుశాయంపేట మండలంలో ₹1.15 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*


ప్రజావాణి శాయంపేట

మండలంలో పలు గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  కింద ₹1.15 కోట్ల వ్యయంతో మంజూరైన పలు సీసీ రోడ్లను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారుల అభివృద్ధిని ప్రజా ప్రభుత్వం వేగవంతం చేస్తోందని తెలిపారు. గట్ల కనపర్తి, సూరంపేట, కొత్తగట్టు, సింగారం, గోవిందపూర్, పెద్దకోడే పాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, పత్తిపాక, ప్రగతి సింగారం, నేరేడుపల్లి, గంగిరేణి గూడెం తదితర గ్రామాల్లో సీసీ రోడ్ల ప్రారంభం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి గ్రామానికి ₹5 లక్షలు, పెద్ద గ్రామాలకు ₹10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు,కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.