నేరెళ్ల తెలంగాణ గురుకులంలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష
••జూలై 31న పాఠశాల స్థాయి ప్రవేశ పరీక్ష..
••జూలై 29 వరకు దరఖాస్తుల స్వీకరణ.
రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల (బాలికలు)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం జూలై 31, 2026 (శుక్రవారం) పాఠశాల స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాధా తెలిపారు.ప్రస్తుతం ఆయా తరగతుల్లో చదువుతున్న అర్హత కలిగిన, ఆసక్తి గల విద్యార్థినులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 29, 2026గా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, స్టడీ సర్టిఫికెట్తో పాఠశాలను సంప్రదించి దరఖాస్తు సమర్పించాలని ప్రిన్సిపాల్ సూచించారు. బ్యాక్లాగ్ సీట్లను సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన విద్యార్థినులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
నేరెళ్ల తెలంగాణ గురుకులంలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష
RELATED ARTICLES


