📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyషాద్నగర్ లో బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం

షాద్నగర్ లో బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం

📰 Generate e-Paper Clip

*షాద్ నగర్ లోబీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం*

*పాల్గొన్న రాష్ట్ర జిల్లా మండల నాయకులు*

*జిల్లా కార్యవర్గ సమావేశంలో పలుగోన్న  బిజెపి సీనియర్ నాయకులు*

*బాల్వంత్ రెడ్డి మరియు సర్పంచ్ బోయ అశోక్ **


షాద్నగర్ ప్రజావాణి జూలై 24 :

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజ్‌ గోపాల్ గౌడ్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాల మరింత విస్తరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో బూత్ కమిటీలను బలోపేతం చేసి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. సమావేశం విజయవంతంగా నిర్వహించిన జిల్లా అధ్యక్షులు రాజ్‌ గోపాల్ గౌడ్ గారికి మరియు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొందుర్గ్ మండల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి  మాజీ సర్పంచ్ బలవంత్ రెడ్డి  గ్రామ సర్పంచ్ బోయ అశోక్ ఉప సర్పంచ్ దామోదర్ రెడ్డి  వార్డ్ సభ్యులు మరాఠీ సురేష్ మరియు షాద్నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు రంగారెడ్డి జిల్లా బిజెపి సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.