📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetరామచంద్రపురం గ్రామంలో వెలగని విద్యుత్ దీపాలు. పట్టించుకోని గ్రామ సర్పంచ్.

రామచంద్రపురం గ్రామంలో వెలగని విద్యుత్ దీపాలు. పట్టించుకోని గ్రామ సర్పంచ్.

📰 Generate e-Paper Clip

రామచంద్రపురం గ్రామంలో వెలగని విద్యుత్ దీపాలు.

పట్టించుకోని గ్రామ సర్పంచ్.

కరెంట్ సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు.

మఠంపల్లి జూలై 24 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో సగానికి పైగా విద్యుత్ దీపాలు వెలగడం లేదు.
సగం గ్రామం అంధకారంలో ఉన్న కనీసం ఎవరు పట్టించుకోవడంలేదని ‌ గ్రామస్తులు తెలిపారు.వర్షం పడితే పురుగు, విషపు పాములు లాంటివి బయటకు వస్తాయి. కుడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, కార్యదర్శి వెంటనే స్పందించి గ్రామంలో వీధిలైట్లు వెలగని చోట వీధిలైట్లు వచ్చేలాగా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

*కార్యదర్శి వివరణ*

గ్రామంలో వీధిలైట్ల సమస్య గురించి గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకుని వెళతాను, త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాము అని కార్యదర్శి వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular