📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyరాహుల్ గాంధీ అరెస్టు, విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా కేశంపేటలో కాంగ్రెస్ ధర్నా

రాహుల్ గాంధీ అరెస్టు, విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా కేశంపేటలో కాంగ్రెస్ ధర్నా

📰 Generate e-Paper Clip

*రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల అరెస్టులు, విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా కేశంపేటలో కాంగ్రెస్ పార్టీ ధర్నా*

*ధర్నా లో పాల్గొన్న కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి*
షాద్ నగర్ ప్రజా వాణి జులై 23:
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా వ్యవహరిస్తూ, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టు చేయడాన్ని, విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు కేశంపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుమగళ్ల రమేష్ ఆధ్వర్యంలో, మాజీ జెడ్పీటీసీ శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తల సమక్షంలో కేశంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన NEET పేపర్ లీక్ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, వారికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ఈ క్రింది డిమాండ్లు చేసింది:

* కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి.
* NEET పేపర్ లీక్ ఘటనపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
* విద్యార్థులపై లాఠీచార్జ్‌కు ఆదేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
* రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
* విద్యార్థుల భవిష్యత్తును రక్షించేలా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, విద్యార్థుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.