📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం  స్కూల్‌లో ఘనంగా ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’

పోరుమామిళ్ల హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం  స్కూల్‌లో ఘనంగా ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 24 ప్రజావాణి స్థానిక పోరుమామిళ్ల మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ ‘హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం స్కూల్’ లో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ సునీల్,అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫాదర్ సునీల్,మాట్లాడుతూ”మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.బడివైపు ఒక్క అడుగు”అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కేవలం పాఠశాల వల్లే సాధ్యం కాదని,ఇటు ఉపాధ్యాయులు,అటు తల్లిదండ్రులు సమన్వయంతో నడిచినప్పుడే పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన ఆకాంక్షించారు.అనంతరం,ఉపాధ్యాయ బృందం విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ మరియు పాఠ్యేతర అంశాలపై తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడి పలు సూచనలు చేశారు,తమ పిల్లల చదువుల పట్ల యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను తల్లిదండ్రులు ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.