📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyవిద్యార్థులకు అండగా మేముంటాం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి షాద్నగర్ ఎమ్మెల్యే...

విద్యార్థులకు అండగా మేముంటాం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📰 Generate e-Paper Clip

*విద్యార్థులకు అండగా మేముంటాం..*

*విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి*

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..*

*షాద్ నగర్ పట్టణ కూడలిలో విద్యార్థుల ధర్నాకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు*
షాద్ నగర్ ప్రజావాణి జూలై 23 :
షాద్ నగర్ పట్టణ కూడలిలో నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు బలి అయ్యాయని, 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, అయినా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే విద్యార్థులపై లాఠీలు విసరడమే కాకుండా, రాహుల్ గాంధీని కూడా గాయపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ముందుకు రావడంలేదని అన్నారు. ఇప్పటిదాకా గాంధేయ మార్గంలోనే ఆందోళన  చేశామని, ప్రభుత్వం దిగి రాకుంటే పార్లమెంటును ముట్టడించడానికి కూడా తాము సిద్ధమే అని అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఒక అసమర్ధ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్న ఏ దేశంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలా ప్రభుత్వాన్ని కొనసాగించడం దారుణమని అన్నారు. అందుకే ప్రభుత్వంతో విసిగి వేసారిన విద్యార్థులు ఆందోళనకు దిగారని, వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని, వారికి సమాధానం దొరకేదాకా తాము బాసటగా ఉంటామని వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను లాఠీలతో కొట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాలలో తప్పులు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేశారని, కేవలం రైలు ప్రమాదం జరిగినందుకే నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి లాంటివాళ్ళు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. అలాంటిది విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోమని, పోరాటమే మార్గంగా ముందుకు సాగుతామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.