📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMulugu8 ఏళ్ల పాత కేసులో దోషిగా తేలిన నిందితుడు కోర్టులో వాదనలు వినిపించి రూ 1000...

8 ఏళ్ల పాత కేసులో దోషిగా తేలిన నిందితుడు కోర్టులో వాదనలు వినిపించి రూ 1000 జరిమానా విధింపు

📰 Generate e-Paper Clip

*8 ఏళ్ల పాత కేసులో దోషిగా తేలిన నిందితుడు*
.కోర్టులో వాదనలు వినిపించి రూ.1000 జరిమానా విధింపు.
.పస్రా పోలీసుల కృషితో నిందితునికి శిక్ష.
.ఐపిసి 324 కేసులో కోర్టు తీర్పు.
.పస్రా ఎస్సై తాజుద్దీన్ పస్రా పోలిస్ స్టేషన్.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*:- గోవిందరావుపేట మండలం పస్రా పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన దాడి కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ములుగు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.
పోలీసుల వివరాల ప్రకారం, పస్రా పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.35/2018, ఐపీసీ సెక్షన్ 324 కింద నమోదైన కేసు (సి.సి. నెం.347/2018)పై విచారణ పూర్తి చేసిన గౌరవ న్యాయస్థానం జూలై 22న తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు వల్లూరి సుబ్బారావును సెక్షన్ 248(2) సీఆర్.పి.సి. ప్రకారం దోషిగా నిర్ధారించి రూ.1,000 జరిమానా విధించింది.
ఈ కేసు విజయవంతంగా ముగియడంలో ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ శంకర్ 8712658366 సమర్థవంతంగా వాదనలు వినిపించగా, పస్రా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తాజుద్దీన్, సీడీఓ శ్రీలత కేసు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పస్రా పోలీసులు సమర్థవంతంగా వ్యవహరిస్తూ, కేసులను వేగంగా విచారణకు తీసుకెళ్లి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల ములుగు జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.