📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వడ్డెర సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

వడ్డెర సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

వడ్డెర సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో ఎల్కతుర్తి మండల వడ్డెర సంఘ అధ్యక్షులు గొల్లేన ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన వడ్డెర సంఘ సమావేశంలో గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గొల్లేన సదీని దండేపల్లి గ్రామశాఖ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా గ్రామశాఖ ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వల్లేపు సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరా రవీందర్ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బొంత రమేష్ టౌన్ అధ్యక్షులు ఓర్సు కుమారస్వామి ఎల్కతుర్తి మండల ప్రధాన కార్యదర్శి అల్లేపు ప్రశాంత్‌తో పాటు మండల, గ్రామ నాయకులు మరియు వడ్డెర సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లేన సదీతో పాటు కార్యవర్గ సభ్యులకు నాయకులు సంఘ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి సమర్థ నాయకత్వంలో దండేపల్లి గ్రామ వడ్డెర సంఘం మరింత బలోపేతమై సంఘ అభివృద్ధికి విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.