📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetగుర్రంపోడు తండాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.

గుర్రంపోడు తండాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

గుర్రంపోడు తండాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.

 

 

ప్రజావాణి మఠంపల్లి జూలై 23.

 

 

సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి పోలీసుల నేతృత్వంలో గుర్రంపోడు తండాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ హాజరై గుర్రంపోడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల వద్దకే పోలీస్ సేవలను చేర్చడం మరియు ప్రజలకు భరోసాగా ఉండదనే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో మహిళలు, బాలల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రణాళిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వారి రక్షణలో పోలీసు అక్క సేవలు అందిస్తూ బాధిత మహిళలకు అండగా ఉంటున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక పోలీస్ అక్కను నియమించాం అన్నారు. ప్రజల భద్రతలో పోలీసులు రాత్రింబవళ్ళు కృషి చేస్తూ కాలనీలు, గ్రామాల్లో నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నారు. యువత, పౌరులు నేరాలకు పాల్పడుతూ కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. విదేశాలు వెళ్లే విషయంలో, ఉద్యోగాలు పొందే సమయంలో సమస్యలు వస్తాయి అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సమాజ రక్షణకు పాటుపడాలి అన్నారు. నేరాల నిరోధం, కేసుల చేదనలో సాంకేతిక పరిజ్ఞానం తో పని చేస్తున్నాం అన్నారు. వృద్ధుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ల వారీగా సీనియర్ సిటిజన్ భద్రత కమిటీలు ఏర్పాటు చేశాం అన్నారు. సామాజిక అంశాలైన సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి నిర్మూలన, సోషల్ మీడియా ప్రభావం, సీసీ కెమెరాల ఏర్పాటు ఉపయోగం, మరియు వృద్ధుల సంక్షేమంపై తండ వాసులకు విస్తృత అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త వ్యక్తులు ఎవరైనా మీ గ్రామానికి వస్తె పోలీసులకు సమాచారం ఇవ్వాలి, అపరిచితులు ఎవరైనా మెసేజ్ చేసిన, ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగిన, బ్యాంక్ వివరాలు అడిగా సమాచారం ఇవ్వొద్దు, డబ్బులు అడిగితే పంపించవద్దు అన్నారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నారు. రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల పై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. అతివేగంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు, రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గంజాయి నుండి మన సమాజాన్ని మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు. గంజాయి డ్రగ్స్ లాంటి వాటి సమాచారం పోలీసులకు ఇవ్వాలి అన్నారు. డయల్ 100, 112 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.