📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriయాదాద్రి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించనున్న తుళ్ల విజయేందర్ గౌడ్‌కు ఘన సత్కారం

యాదాద్రి దేవస్థాన పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించనున్న తుళ్ల విజయేందర్ గౌడ్‌కు ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూలై 19: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితులైన మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు తుళ్ల విజయేందర్ గౌడ్ సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి యాదగిరిగుట్టకు వెళ్తున్న సందర్భంగా ఘట్కేసర్‌లో ఘన స్వాగతం లభించింది.

ఘట్కేసర్‌లోని వందనం హోటల్ సమీపంలో స్థానిక నాయకులు, అభిమానులు కలిసి తుళ్ల విజయేందర్ గౌడ్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఘనాపూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ్ గౌడ్, పాటి సురేందర్ రెడ్డి, సామల జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా విజయేందర్ గౌడ్ సేవలు అందించి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి తుళ్ల విజయేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేసినట్లు నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.