📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetప్రజల మనసు గెలుచుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు భావోద్వేగ వీడ్కోలు

ప్రజల మనసు గెలుచుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు భావోద్వేగ వీడ్కోలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు విజయవంతంగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ సాధారణ బదిలీలలో భాగంగా సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన శ్రీనివాస్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన బదిలీ కావడంతో బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు.ఈ సందర్భంగా కానిస్టేబుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే అవకాశం కల్పించిన ఉన్నతాధికారులకు, అలాగే నా విధి నిర్వహణలో అన్ని విధాలుగా సహకరించిన బెజ్జంకి మండల ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల ఆదరణను ఎప్పటికీ మరువలేను” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular