ప్రజల మనసు గెలుచుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు భావోద్వేగ వీడ్కోలు

బెజ్జంకి, జూలై 18 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు విజయవంతంగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ సాధారణ బదిలీలలో భాగంగా సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన 'పల్లె నిద్ర' కార్యక్రమంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన శ్రీనివాస్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన బదిలీ కావడంతో బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల ప్రజలు...