📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘాట్ కేసర్ మండల్లో   చెట్టు కొమ్మల కత్తిరింపు, ఫీడర్ నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా...

ఘాట్ కేసర్ మండల్లో   చెట్టు కొమ్మల కత్తిరింపు, ఫీడర్ నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 16: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణతో పాటు విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 17 (శుక్రవారం) కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలో:

11 కేవీ కొండాపూర్ డొమెస్టిక్ ఫీడర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండాపూర్ గ్రామం, బాలాజీనగర్, సోను కాలనీ, పటేల్ నగర్, సంగమిత్ర, ప్రైమ్ ల్యాండ్ తదితర ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

11 కేవీ మాధారం వ్యవసాయ ఫీడర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాధారం గ్రామం, మాధారం వ్యవసాయ ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

నారపల్లి ఉపకేంద్రం పరిధిలో:

11 కేవీ నారపల్లి ఫీడర్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వెంకటాద్రి టౌన్‌షిప్, చౌదరిగూడ, విజయపురి కాలనీ, శివాజీ నగర్, ఓయూ కాలనీ తదితర ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

11 కేవీ పోచారం వ్యవసాయ ఫీడర్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నీలిమ ఆసుపత్రి పరిసరాలు, అరుంధతి కాలనీ, వైభవ్ కాలనీ, మినీ సింగపూర్, మోదీ బిల్డర్స్, తులిప్స్ గ్రాండ్ తదితర ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

విద్యుత్ వినియోగదారులు అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. అత్యవసర సేవల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular