ఘాట్ కేసర్ మండల్లో చెట్టు కొమ్మల కత్తిరింపు, ఫీడర్ నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత
ఘట్‌కేసర్, జూలై 16: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణతో పాటు విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 17 (శుక్రవారం) కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలో: 11 కేవీ కొండాపూర్ డొమెస్టిక్ ఫీడర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండాపూర్ గ్రామం, బాలాజీనగర్, సోను కాలనీ, పటేల్ నగర్, సంగమిత్ర, ప్రైమ్ ల్యాండ్ తదితర ప్రాంతాలు...