📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriపోచారం అన్నా నగర్‌లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

పోచారం అన్నా నగర్‌లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

పోచారం, జూలై 15: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం డివిజన్ పరిధిలోని అన్నా నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు అధ్యక్షులు కర్రె రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలగౌని వెంకటేష్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణారెడ్డి, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గౌడ్, మెట్టు నరసింహారెడ్డి, గంధమల్ల రమేష్ కుమార్ గౌడ్, యువ నాయకులు బద్దం మల్లికార్జున్ రెడ్డి, వినోద్, నాగరాజు గౌడ్, సహదేవ్ గౌడ్, మహిళా నాయకురాళ్లు ఎర్ర మాధవి, వంగాల లక్ష్మి, గౌరితో పాటు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular