పోచారం అన్నా నగర్‌లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

పోచారం, జూలై 15: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం డివిజన్ పరిధిలోని అన్నా నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు అధ్యక్షులు కర్రె రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతి...