📄 ePaper
Wednesday, July 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్టిడిపికి రైతుల గోడు పట్టదా! *పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్ * ఉప...

టిడిపికి రైతుల గోడు పట్టదా! *పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్ * ఉప సర్పంచ్,రాళ్లపల్లి రవి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 13 ప్రజావాణి ఆయకట్టు రైతులు దాదాపు 5వేల ఎకరాలు చెరువు కింద వరి పంటను సాగు చేస్తున్నారని ఈ సంవత్సరం పంటకు నాటు కూడా వేశారని పోరుమామిళ్ల చెరువు నుండి వర్షాలు లేకపోయిననూ నీళ్లు వదలడానికి దాదాపు మూడు నెలలు వ్యవధి పడుతుండగా కేవలం 20 రోజుల్లోనే పోరుమామిళ్ల చెరువు నుండి రంగసముద్రం చెరువునకు నీటిని వదలడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు కాంట్రాక్టర్లుగా మారి రాజకీయ ఒత్తిడితో చేపల కాంట్రాక్టర్లకు అనుకూలంగా చెరువులోని నీటిని అనవసరంగా వదిలి ఆయకట్టు రైతులకు పొట్ట కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో గంగనపల్లి చెరువు నుండి వరికుంట్ల చెరువుకు పైపుల ద్వారా రైతులకు అనుకూలంగా నీటి సౌకర్యం కల్పించారని టిడిపి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న గంగనపల్లె, వరికుంట్ల రైతుల నీటి సౌకర్యాన్ని గురించి ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. కలసపాడు మండలం తెల్లపాడు లో ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేశారని వరికుంట్ల ప్రజలు కనీసం త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించమని వేడుకుంటున్నా ర న్నారు. ఈ సమస్యలపై త్వరలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular