📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ 6వ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహణ

ఘట్కేసర్ 6వ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 312లో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎంసీ శ్రీ వేణుగోపాల్ పర్యవేక్షించి, డిక్లరేషన్ ఫారాల నింపడం, ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్‌ఓ మధుసూదన్ గౌడ్, ప్రవీణ్, బీఎల్‌ఏగా వ్యవహరిస్తున్న యూత్ కాంగ్రెస్ ఘట్కేసర్ 6వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ యుద్దీన్, విక్రాంత్ రెడ్డి, అబ్దుల్ ఖదీర్, నైముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఓటర్లతో డిక్లరేషన్ ఫారాలను నింపించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఘట్కేసర్ 6వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ యుద్దీన్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.