📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyజిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

 

ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ

 

రామచంద్రపురం, జూలై 11(ప్రజావాణి):టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులను రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్‌లో శనివారం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టు ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభినందన సభకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ బాసిత్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం సంఘం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన నాయకులు అంకితభావంతో పనిచేసి ప్రతి జర్నలిస్టుకు అండగా నిలవాలని సూచించారు.

అనంతరం జిల్లా జనరల్ సెక్రటరీ అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కె. శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జనరల్ సెక్రటరీ భశ్వేశ్వర్, ఈసీ సభ్యుడు మజీద్ అలీ తదితరులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.

సన్మానితులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శ కమిటీగా తీర్చిదిద్దేందుకు సభ్యుల సహకారంతో శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభాకర్ యాదవ్‌కు, ముఖ్య అతిథి అబ్దుల్ బాసిత్‌కు, హాజరైన జర్నలిస్టులు, సంఘ సభ్యులందరికీ సన్మానితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular