📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణNizamabadనవనాధపురం ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమానికి అయ్యప్ప ఫౌండేషన్ చేయూత

నవనాధపురం ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమానికి అయ్యప్ప ఫౌండేషన్ చేయూత

📰 Generate e-Paper Clip



– నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ.
– ముఖ్య అతిథులుగా ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి,  ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి.
– సమాజంలో సానుకూల మార్పుకు జర్నలిస్టులు కృషి చేయాలి : జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి.
– ప్రజల సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకం : ఏసీపీ
– జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం : అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్


ఆర్మూర్ టౌన్, జూలై 11(మన సమగ్ర ప్రజావాణి):

ప్రజలకు మేలు చేసే సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, సమాజంలో సానుకూల మార్పు కోసం జర్నలిస్టులు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం నవనాథపురం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాద బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకరి గంగామోహన్ అధ్యక్షత వహించగా, జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరళారాణి మాట్లాడుతూ…, ప్రజల కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులకు అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ప్రమాద బీమా కల్పించడం అభినందనీయమన్నారు. వార్తా సేకరణ కోసం నిరంతరం ప్రయాణాలు చేసే జర్నలిస్టులకు ప్రమాద బీమా ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం వల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు ముందుండాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…., సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యలను, సమాజంలో ఉన్న అవకతవకలను వెలికితీసి వాటి పరిష్కారానికి దోహదపడేలా జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు. 24 గంటలు విధుల్లో ఉండే జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం అభినందనీయమైన కార్యక్రమమని అన్నారు.
అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ…, ఫౌండేషన్ ద్వారా పేదలకు తమ వంతు సహాయం అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల అభ్యర్థన మేరకు వారికి ప్రమాద బీమా చేయించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ నవనాథపురం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పత్రాలను పంపిణీ చేశారు. అలాగే నవనాథపురం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఫౌండేషన్ తరఫున మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్‌పుతే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు షికారి శ్రీనివాస్, కార్యదర్శి మ్యాకల దినేష్, కోశాధికారి తొగర్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి అర్గుల్ అజీమ్, సలహాదారులు మంచిర్యాల నరేందర్, బారడ్ గణేష్, సభ్యులు గోజూరు మహిపాల్, తమ్మె వినోద్, ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చేపూర్ గణేష్, జర్నలిస్టులు విన్సెంట్, శ్రావణ్, మోహన్ రెడ్డి, గణేష్ గౌడ్, గటడి అశోక్, చరణ్ గౌడ్, సామ సురేష్, వెంకటేశ్వర్ గుప్తా, మహేష్, లిక్కి సావన్ కుమార్, మోహన్ బాబు, ముఖేష్, గటడి అరుణ్, ఘటడి రాజ్‌కుమార్, రాంపూర్ శ్రావణ్, చిరంజీవి, పోహార్ కిరణ్, నితీష్, విట్టల్, సంజీవ్, హనీఫ్, ఫౌండేషన్ సభ్యుడు ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular