📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriరాజీవ్ గృహకల్ప లో సేవాదాత పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

రాజీవ్ గృహకల్ప లో సేవాదాత పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్ మండల పరిధిలోని పోచారం 8వ డివిజన్‌లో జనగాం ఎమ్మెల్యే, నీలిమా హాస్పిటల్ అధినేత, ప్రముఖ సేవాదాత శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద ప్రజలకు అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ ఆయనకు కృతజ్ఞతాభావంతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని పోచారం 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొమ్ముల ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి పేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రపాణి, శ్రీనివాస్, చందర్, యువజన నాయకులు రవీందర్, మల్లికార్జున్, పవన్, సతీష్, మహేందర్, అఖిల్‌తో పాటు కాలనీవాసులు, యువకులు, అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.