📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేలు నియోజకవర్గం లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ 78 .68% పూర్తి*ఇప్పటికైనా రాజకీయ పార్టీలు...

బద్వేలు నియోజకవర్గం లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ 78 .68% పూర్తి*ఇప్పటికైనా రాజకీయ పార్టీలు సహకరించండి*బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్

📰 Generate e-Paper Clip

బద్వేలు ప్రజావాణి జులై 10) నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ 78.68 శాతం పూర్తి అయినట్లు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కలసపాడు, కాశీనాయన ,పోరుమామిళ్ల ,బి కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాల్లో మొత్తం ఓటర్లు 2,22,043 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1,74,704 మంది ఓటర్లు నమోదు అయ్యారన్నారు. ఇంకా 41,058 మంది ఓటర్లు నమోదు కావాల్సి ఉందని చెప్పారు .నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓ లతో సహా 1500 మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు గుర్తించిన 6,281 మందిలో చనిపోయిన వారు, డబల్ ఎంట్రీలు, షిఫ్టింగ్ అయినవారు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు సహకరించడం లేదు రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని ఆర్డిఓ చంద్రమోహన్ అన్నారు .ఏ ఒక్క రాజకీయ పార్టీ సర్ ప్రక్రియలో సహకారం అందించడం లేదన్నారు .ఇప్పటికైనా వారు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ఓటు మిస్ కాకుండా నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు సూచించారు.లేకుంటే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.బద్వేలు ఆర్టీవో కార్యాలయంలో సర్ ప్రక్రియకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ పెట్టామన్నారు. సందేహాలు ఉన్నవారు చరవాణి 6301432849 నెంబర్ కు చేస్తే నువ్వుర్తి చేస్తారన్నారు కార్యక్రమంలో బద్వేలు గోపవరం తహసిల్దార్లు తిరుమల బాబు, జీవన్ చంద్రశేఖర్, ఎలక్షన్ డిటి లక్ష్మీప్రసన్న, శశికళ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.