బద్వేలు నియోజకవర్గం లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ 78 .68% పూర్తి*ఇప్పటికైనా రాజకీయ పార్టీలు సహకరించండి*బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్

బద్వేలు ప్రజావాణి జులై 10) నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ 78.68 శాతం పూర్తి అయినట్లు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కలసపాడు, కాశీనాయన ,పోరుమామిళ్ల ,బి కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాల్లో మొత్తం ఓటర్లు 2,22,043 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1,74,704 మంది ఓటర్లు నమోదు అయ్యారన్నారు. ఇంకా 41,058 మంది ఓటర్లు నమోదు కావాల్సి ఉందని చెప్పారు .నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో...