📄 ePaper
Friday, July 10, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalచెన్నారావుపేటలో వరుస దొంగతనాలు

చెన్నారావుపేటలో వరుస దొంగతనాలు

📰 Generate e-Paper Clip

చెన్నారావుపేటలో వరుస దొంగతనాలు

చిరు వ్యాపారుల భయాందోళన

​చెన్నారావుపేట జూలై 09 ప్రజావాణి

మండల కేంద్రంలో వరుస దొంగతనాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మండల కేంద్రానికి చెందిన వైనాల కోమల కూరగాయల షాపులో దూరి రూ. 3 వేల నగదుతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను అపహరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గఫ్ఫార్ పాన్ షాప్ తాళాలను గడ్డపారతో పగలగొట్టి చోరీకి యత్నించారు. వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాల సంఘటనలతో స్థానిక చిరు వ్యాపారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular