చెన్నారావుపేటలో వరుస దొంగతనాలు
చిరు వ్యాపారుల భయాందోళన
చెన్నారావుపేట జూలై 09 ప్రజావాణి
మండల కేంద్రంలో వరుస దొంగతనాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మండల కేంద్రానికి చెందిన వైనాల కోమల కూరగాయల షాపులో దూరి రూ. 3 వేల నగదుతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను అపహరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గఫ్ఫార్ పాన్ షాప్ తాళాలను గడ్డపారతో పగలగొట్టి చోరీకి యత్నించారు. వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాల సంఘటనలతో స్థానిక చిరు వ్యాపారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.