కడప (ప్రజావాణి జులై 09)కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం పేరుతో ఈనెల 11వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్ లో జరిగే సదస్సుకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కే ఆంజనేయులు హాజరవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య లు తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన నేటికీ గ్రామాలలో దళితుల పట్ల కుల వివక్షత దేవాలయాల్లో ప్రవేశం లేదని చనిపోయిన వారిని గౌరవప్రదంగా పూడ్చటానికి స్మశానాలు లేని గ్రామాలు ఉన్నాయి. ప్రతి స్మశానాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని ప్రభుత్వం రెండు ఎకరాలు భూ పంపిణీ అమలు కోసం తెచ్చిన జీవో నెంబర్ 1235ను అమలు చేయాలని కోరారు.ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని తీర్పునిచ్చింది దీంతో దళితులు తీవ్ర ఆందోళన పెరిగింది. మతం మారిన కుల వివక్ష వెంటాడుతూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు.సామాజిక సమస్యలతో పాటు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలు లేని గ్రామాలు ఉన్నాయి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.గ్రామాలలో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలని జగనన్న కాలనీలను పూర్తిచేయాలని సిమెంట్ రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పెసల రఘు జార్జి నగర అధ్యక్ష కార్యదర్శులు సిపి రమణ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 11న సామాజిక న్యాయం జిల్లా సదస్సును జయప్రదం చేయండి
0
16
RELATED ARTICLES
- Advertisment -




