📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పేరుకే మున్సిపాలిటీ.. అడిగితే నచ్చినోడికి చెప్పుకోమనే సిబ్బంది! బద్వేల్‌లో బరితెగించిన పారిశుధ్య విభాగం

పేరుకే మున్సిపాలిటీ.. అడిగితే నచ్చినోడికి చెప్పుకోమనే సిబ్బంది! బద్వేల్‌లో బరితెగించిన పారిశుధ్య విభాగం

📰 Generate e-Paper Clip

బద్వేల్ జూలై 07 ప్రజావాణి“లక్షల రూపాయలు పన్నులు కడుతున్నాం.కనీస సౌకర్యాలు కల్పించరా?”అని ప్రశ్నించినందుకు,”నీ బుద్ధి పుట్టిన వాళ్లకు చెప్పుకో.”నీకు నచ్చినోడికి కంప్లైంట్ చేసుకో.మేము చెత్త ఎత్తము!”అంటూ బద్వేల్ మున్సిపల్ కింది స్థాయి సిబ్బంది బహిరంగంగానే ప్రజలపై దౌర్జన్యానికి దిగుతున్నారు.బద్వేల్ మున్సిపాలిటీలో పారిశుధ్య వ్యవస్థ ఎంతలా భ్రష్టు పట్టిందో చెప్పడానికి నెల్లూరు రోడ్డులో చోటుచేసుకుంటున్న ఉదంతాలే నిదర్శనం.ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురికి.పట్టించుకోని అధికారులు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు మెయిన్ రోడ్డు వెనుక భాగంలో ఉన్న దొడ్డి వాకిళ్లలో సంవత్సరాలుగా మురికి,చెత్తాచెదారం పేరుకుపోయి నరకాన్ని తలపిస్తోంది.ఈ తీవ్రమైన సమస్యపై స్థానికులు మున్సిపల్ ఉన్నతాధికారులకు,శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.అధికారులు కేవలం వచ్చి చూసి వెళ్లడమే తప్ప, అక్కడ పేరుకుపోయిన మురికిని తొలగించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు.ప్రశ్నిస్తే ఎదురుదాడి.. సిబ్బంది అహంకారం!
ఏళ్ల తరబడి ఉన్న చెత్తను ఎందుకు తొలగించడం లేదని బాధితులు మున్సిపల్ సిబ్బందిని నిలదీయగా.. వారు అత్యంత బాధ్యతారహితంగా,దౌర్జన్యంగా సమాధానం ఇస్తున్నారు. “మీరు మాకు ఫోన్ చేసి చెత్త ఎత్తిస్తారా?” అంటూ ఫిర్యాదుదారులపైనే దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నారు.”సమస్యపై కమిషనర్‌ను అడుగుతాం” అని చెబితే.”నీకు నచ్చిన వారికి చెప్పుకో, అవసరమైతే కమిషనర్‌కే కంప్లైంట్ చేసుకో.మాకు ఎవరి భయం లేదు, మేము చెత్త ఎత్తేది లేదు”అంటూ బహిరంగంగా ప్రజలకే సవాల్ విసురుతున్నారు.కమిషనర్ ఆదేశాలకూ లేని విలువ ఈ నిర్లక్ష్యంపై బాధితులు మున్సిపల్ కమిషనర్‌కు నేరుగా మెసేజ్ (ఫిర్యాదు) పంపగా, ఆయన దానిని కింది స్థాయి సిబ్బందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే, ఆ సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి “సమస్య ఎక్కడ ఉందో చెప్పండి” అని అడగడంతోనే సరిపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పని చేయడం లేదు.మున్సిపల్ కమిషనర్ ఇచ్చే ఆదేశాలకు కూడా కింది స్థాయి సిబ్బంది ఇక్కడ కనీస విలువ ఇవ్వడం లేదనేది స్పష్టమవుతోంది.మిషనర్ చర్యలు తీసుకుంటారా.వత్తాసు పలుకుతారా?ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ,పన్నులు కట్టే ప్రజలపైనే దౌర్జన్యానికి దిగుతున్న ఇటువంటి అహంకార సిబ్బందిపై బద్వేల్ మున్సిపల్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోతే.ఉన్నతాధికారులు కూడా ఈ అవినీతి,నిర్లక్ష్య సిబ్బందికే వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలను ప్రజలు నిజం నమ్మాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.