📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriపోచారం సర్కిల్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కర్రె రాజేష్‌కు ఘన సన్మానం

పోచారం సర్కిల్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కర్రె రాజేష్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 4 (ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ, పోచారం సర్కిల్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కర్రె రాజేష్‌కు శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పోచారం సర్కిల్ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన పదవీకాలంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్ కార్యకర్తల సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. వీరి సమిష్టి కృషి వల్లే పోచారం సర్కిల్‌లో కొత్త నాయకత్వం సజావుగా రూపుదిద్దుకుందని అభిప్రాయపడ్డారు.

నూతన అధ్యక్షుడు కర్రె రాజేష్ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానన్నారు. మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏర్పరచిన సంస్థాగత పునాదిని మరింత బలోపేతం చేస్తూ, నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సంక్షేమం, పోచారం సర్కిల్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. భవిష్యత్తులో పోచారం సర్కిల్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మెట్టు గణేష్ యాదవ్, పాలకూరి నాగరాజుగౌడ్, బద్రి హేమంత్, ఎర్ర రాజు, వినోద్, సత్యనారాయణ, ఆకిటి యుగంధర్ రెడ్డి, కొంతం శంకర్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, బద్దం వెంకట్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, బద్దం మల్లికార్జున్ రెడ్డి, పోలు నరేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, సారగండ్ల రమేష్ కుమార్, గంధమల్ల రమేష్ కుమార్ గౌడ్, వంగాల లక్ష్మి, మెట్టు తిరుమల్ రెడ్డి, వినయ్, రాజేష్, వెంకటేష్, సాయి చారి, విజయ్ రెడ్డి, బలరాములు, నటరాజ్, నాగచైతన్యతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తల ఉత్సాహభరిత హాజరు పార్టీ ఐక్యతను, సంస్థాగత బలాన్ని ప్రతిబింబించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular