పోచారం సర్కిల్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కర్రె రాజేష్‌కు ఘన సన్మానం
ఘట్‌కేసర్, జూలై 4 (ప్రజావాణి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ, పోచారం సర్కిల్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కర్రె రాజేష్‌కు శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పోచారం సర్కిల్ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన పదవీకాలంలో పార్టీ బలోపేతానికి...