📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఇటుకులపాడులో వారం రోజులుగా వృథా అవుతున్న తాగునీరు.పట్టించుకోని సచివాలయం అధికారులు పై గ్రామస్తుల ఆగ్రహం

ఇటుకులపాడులో వారం రోజులుగా వృథా అవుతున్న తాగునీరు.పట్టించుకోని సచివాలయం అధికారులు పై గ్రామస్తుల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

కాశినాయన (జులై 04 ప్రజావాణి) బద్వేల్ ఇంచార్జి వినోద్) ఇటుకులపాడు గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయి వారం రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్లన్నీ బురదమయం, ప్రజలు ఇబ్బంది,గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న తాగునీటి పైప్‌లైన్ గత వారం రోజులుగా పగిలి ఉంది. దీంతో వేల లీటర్ల నీరు రోడ్డుపైకి చేరి మురుగు కాల్వలా మారింది. రోడ్డంతా బురదగా మారడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైక్‌లు జారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నీరు నిలిచి,గుంతలు ఏర్పడి, చెత్తతో కలిసి అసహ్యంగా కనిపిస్తోంది.అంటువ్యాధుల భయం,నిల్వ ఉన్న నీటిలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.”ఇప్పటికే వేసవిలో నీటికి ఇబ్బంది పడుతున్నాం. పైప్‌లైన్ పగిలి నీరు ఇలా వృథా అవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.రోజూ ఫోన్ చేస్తున్నాం, ఆఫీస్‌కు వెళ్లి చెబుతున్నాం.కానీ ‘చూస్తాం’ అని చెప్పి వదిలేస్తున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి”అని ఒక గ్రామస్తుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తున్నామని చెబుతుండగా, ఇలా విలువైన నీరు వృథా అవుతుండటం బాధాకరమని వారు అన్నారు.వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ప,గిలిన పైప్‌లైన్‌ను వెంటనే మరమ్మతు చేయాలని, వృథాగా పోతున్న నీటిని ఆపాలని, రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.