ఇటుకులపాడులో వారం రోజులుగా వృథా అవుతున్న తాగునీరు.పట్టించుకోని సచివాలయం అధికారులు పై గ్రామస్తుల ఆగ్రహం

కాశినాయన (జులై 04 ప్రజావాణి) బద్వేల్ ఇంచార్జి వినోద్) ఇటుకులపాడు గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయి వారం రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్లన్నీ బురదమయం, ప్రజలు ఇబ్బంది,గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న తాగునీటి పైప్‌లైన్ గత వారం రోజులుగా పగిలి ఉంది. దీంతో వేల లీటర్ల నీరు రోడ్డుపైకి చేరి మురుగు కాల్వలా మారింది. రోడ్డంతా బురదగా మారడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు...