📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గాగిల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

గాగిల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 2 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో కొండ అనసూర్య–లక్ష్మీనారాయణ రావు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం సర్పంచ్ ఎర్రల జానకి రాజు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రల జానకి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, చింతలపల్లి లతకొండల్ రెడ్డి, సొల్లు బాలయ్య, న్యాలం శారద శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పులి శ్రీనివాస్, బొమ్మరవేణి సంతోష్, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.