గాగిల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
బెజ్జంకి, జూలై 2 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో కొండ అనసూర్య–లక్ష్మీనారాయణ రావు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం సర్పంచ్ ఎర్రల జానకి రాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రల జానకి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు...