మడిపల్లి గ్రామ శివారులో దారుణ హత్య
* మృతుడి భార్య పైతరి శారద పోలీసులకుఫిర్యాదు చేసింది
* వ్యక్తి దారుణ హత్యఒకరిపై అనుమానం వ్యక్తం చేస్తూ భార్య ఫిర్యాదు
జమ్మికుంటజూన్ 28 (ప్రజావాణి)
మడిపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారంఅంకుషాపూర్ గ్రామానికి చెందిన పైతరి మొగిలి (తండ్రి సాయిలు) నిన్న (తేదీ 27-06-2026) సాయంత్రం అందాజా ఆరు గంటల సమయంలో మడిపల్లి గ్రామంలో జరుగుతున్న పీర్ల పండుగకు వెళ్తానని తన సైకిల్‌పై బయలుదేరి వెళ్లాడు. పండుగ వేడుకలు ముగించుకుని తిరిగి రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్యలో ఇంటికి వస్తుండగా మడిపల్లి గ్రామ శివారులోకి చేరుకునేసరికి గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై బలమైన ఆయుధంతో దాడి చేశారు. ఈ దాడిలో మొగిలి తల భాగం నుదురు గదవ కింద తీవ్రమైన గాయాలు కావడంతో విపరీతంగా రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ దారుణ హత్యపై మృతుడి భార్య పైతరి శారద పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన భర్త మృతి పట్ల మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (తండ్రి ఐలయ్య) అనే వ్యక్తిపై తనకు బలమైన అనుమానం ఉందని ఆమె తన దరఖాస్తులో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం దర్యాప్తును వేగవంతం చేశారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు
మడిపల్లి గ్రామ శివారులో దారుణ హత్య
RELATED ARTICLES




