📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyపోలియో రహిత సమాజ నిర్మాణమే మన అందరి కర్తవ్యం

పోలియో రహిత సమాజ నిర్మాణమే మన అందరి కర్తవ్యం

📰 Generate e-Paper Clip

*పోలియో రహిత సమాజ నిర్మాణమే మన అందరి కర్తవ్యం*

*తంగెళ్లపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం*

*ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి…. మాజీ జెడ్పీటీసీ తనయుడు  రామకృష్ణ*
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 28:
పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే మన అందరి కర్తవ్యం అని కొందుర్గు మండల మాజీ జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. కొందుర్గు మండలంలోని తంగేళ్లపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో కొందుర్గు మండల మాజీ జడ్పిటిసి తనయుడు రామకృష్ణ పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా గ్రామంలోని
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలంటే ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ గ్రామంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రజలు ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ప్రవీణ్, బుట్ట బాలరాజ్, కరీం, ఆరోగ్య శాఖ ఏఎన్ఎం శ్యామల, ఆశా వర్కర్ ఫౌజీయా, అంగన్‌వాడీ సిబ్బంది, రాములమ్మ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.