📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

📰 Generate e-Paper Clip

*ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ*

* *మన ప్రజావాణి*, మందమర్రి:- జూన్ 28

పట్టణం తోపాటు జిల్లా కేంద్రమైన మంచిర్యాల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలోని పలువురు నిరుపేదలకు కంజర్ల స్వామి రావు వర్ధంతి సందర్భంగా  ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా లు మాట్లాడుతూ, మంచిర్యాల రైల్వే స్టేషన్ తో పాటు పట్టణంలోని నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయడం జరిగిందని, ఈ ఆహారాన్ని స్వామి రావు కుటుంబ సభ్యులతో వారి కుమారుడు చేతుల మీదుగా నిరుపేదలకు అందించామన్నారు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో తమ సొసైటీని సంప్రదించినట్లయితే వారి వంతుగా పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేసి మానవత సేవ చేస్తామని తెలిపారు. అందరం కలిసి కలిసి కట్టుగా కృషి చేస్తే దేశంలో ఆకలితో ఎవరు బాధపడరన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వామి రావు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజు కుమార్, సభ్యులు మహమ్మద్ జావిద్ పాషా, సునీల్, రాజు లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular