బెజ్జంకి,జూన్ 28 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమంలో బెజ్జంకి మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు,గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 0-5 సంవత్సరాలు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని మీ యొక్క చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




