📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

📰 Generate e-Paper Clip

*నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత*


*3గురు నిందితులను అరెస్ట్*

*100 కిలోల విడి పత్తి విత్తనాలు, రెండు బైకులు స్వాధీనం*

మందమర్రి (*మన ప్రజావాణి*) జూన్ 27

రైతులను మోసం చేస్తూ, లాభాలు గడించడమే ధ్యేయంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను, 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ మాట్లాడుతూ, మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి, అగ్రికల్చర్ సిబ్బంది, పట్టణ పోలీసులు కలిసి శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 363, అందుగులపేట శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా, ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను ఆపి, విచారించగా వారి వద్ద నుండి నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిలో జిల్లాలోని పాత మంచిర్యాల మధుర నగర్ కు చెందిన మాకినేని రాఘవేంద్ర (39), పట్టణంలోని బురదగూడెం కు చెందిన కట్ట నరేష్(41), పుట్టగంటి పవన్ కుమార్(39) లను అదుపులోని తీసుకోవడం తోపాటు వారి వద్ద నుండి ఎటువంటి సర్టిఫైడ్ లేబుల్స్, బిల్లులు లేని 100 కిలోల విడి పత్తి విత్తనాలు, ఒక్క అపాచీ బైక్, ఒక్క టీవీఎస్ బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అమాయక రైతులను నకిలీ పత్తి విత్తనాలతో ముంచే ఇలాంటి అక్రమార్కులపై  కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. రైతులకు నష్టం చేకూరుస్తూ, అక్రమంగా నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ ఎస్ఐ నరేష్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్ లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular