📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు ఎంఆర్వో చంద్రశేఖర్ విజ్ఞప్తి

ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు ఎంఆర్వో చంద్రశేఖర్ విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 27: ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఎడులాబాద్, కొర్రెముల, ప్రతాప్ సింగారం, కాచవాని సింగారం, ముత్వలీగూడ గ్రామాలకు చెందిన కొన్ని భూములు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో ఉన్నాయని మండల తహసీల్దార్ (ఎంఆర్వో) చంద్రశేఖర్ తెలిపారు.

ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ఆసక్తి ఉన్న భూ యజమానులు, రైతులు తమ సమ్మతిని మండల రెవెన్యూ కార్యాలయం (ఎంఆర్వో కార్యాలయం)లో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆయా గ్రామాల వార్డు కార్యాలయాలు (పాత గ్రామపంచాయతీ కార్యాలయాలు)లో కూడా వివరాల నమోదు, అభిప్రాయాల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రతాప్ సింగారం గ్రామానికి సంబంధించి జూన్ 29, కాచవాని సింగారం గ్రామానికి జూన్ 30, ముత్వలీగూడ గ్రామానికి జూలై 1, కొర్రెముల గ్రామానికి జూలై 2, ఎడులాబాద్ గ్రామానికి జూలై 3 తేదీల్లో వివరాల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సంబంధిత రైతులు, భూ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత తేదీల్లో తమ ఆమోదాన్ని నమోదు చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular