📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సర్వే నెంబర్ 4లో గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ ఎక్కడ:-సిపిఐ ప్రశ్న

సర్వే నెంబర్ 4లో గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ ఎక్కడ:-సిపిఐ ప్రశ్న

📰 Generate e-Paper Clip

NH-67 జాతీయ రహదారి పక్కనే ఆక్రమణకు గురైన వంక పట్టించుకోని రెవెన్యూ అధికారులు:- సిపిఐ బద్వేలు రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు

బద్వేల్ మండలం వనంపుల గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 4 దాదాపు 4 ఎకరాలపైబడి వంక పోరంబోకు అక్రమణకు గురైందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగ దాసరి ఇమ్మానుయేల్ తెలిపారు. శనివారం ఆక్రమణకు గురైన వంక పోరంబోకు భూమిని సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… బద్వేల్ మండలం వనంపుల గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 4 నందు 4 ఎకరాల పైబడి వంక ఉందని కొండ నుంచి నీరు ఆ వంకకు వచ్చేందుకు ఎన్ హెచ్ 67 జాతీయ రహదారికి బ్రిడ్జిని నిర్మించి దాని ద్వారా వంకకు నీరు వచ్చే విధంగా అనుకూలంగా గతంలో చేశారని, దానికి అనుకూలంగా ఆ వంకలో నీరు నిల్వ ఉండేందుకు 2004 ప్రభుత్వంలో చెక్ డాం కూడా నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. అయితే కొంతమంది భూకబ్జాదారులు ఆ భూమిపై కన్నేసి నాలుగు ఎకరాల పైబడి ఉన్న వంక ను ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించి 2016లో కొంత 2023లో కొంత భూమి ఆన్లైన్ చేపించుకొని అనుభవిస్తున్నారని, ఆ వంక పోరంబోకులో ఉన్న చెక్ డ్యామ్ను కూడా పూర్తిగా చదును చేసి దానిపైన రోడ్డు మాదిరిగా మొత్తం మట్టి వేసి కప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు నాలుగు ఎకరాల పైబడి ఉన్న వంకను పూర్తిగా ఆక్రమణ చేసి మొత్తం ప్లాట్లు వేసి కొంత అమ్మడం కూడా జరిగిందని, ఇంత జరుగుతున్న జాతీయ రహదారి పక్కనే ఉన్న కూడా రెవెన్యూ అధికారులు కానీ వాటర్ షెడ్ అధికారులు కానీ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో భూకబ్జాదారులు యదేచ్చగా ప్లాట్లు వేసి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. 2007 సంవత్సరం తర్వాత ఎక్కడ కూడా అసైన్మెంట్ జరగలేదని వీరికి ఏ ప్రాతిపదికన ఆన్లైన్ చేసి పట్టా పాస్ బుక్కులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పేదల రెండు సెంట్లు ఆక్రమిస్తేనే ఆగ మేఘాల మీద దాడి చేసే రెవెన్యూ అధికారులకు కోట్ల విలువైన ప్రభుత్వ వంక ఫారం పోకు భూమి ఆక్రమణకు గురైతే కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు రెవెన్యూ అధికారులు ఈ భూమిపై కన్నెత్తి చూడకపోవడం వెనక ఈ ఆక్రమణలో రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను విచారించి ఈ ఆక్రమణంలో రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉన్నా వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే కుంటను ఆక్రమించి అక్రమంగా ఆన్లైన్ చేసిన వారిపై అదేవిధంగా చెక్ డ్యామ్ ను పూర్తిగా తొలగించి కనుమరుగు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వంక ఫారంపోకు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ పర్యటనలో సిపిఐ రూరల్ నాయకులు సుధాకర్, ప్రసాద్, వెంకటరమణ, బ్రహ్మయ్య పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.