📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialపల్లె ప్రకృతి వనంలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

పల్లె ప్రకృతి వనంలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

వెల్గటూర్ మండలం రాజక్కపల్లికి చెందిన గుమ్ముల సాయిమనోజ్ (23) శనివారం ముక్కట్రావుపేట పల్లె ప్రకృతి వనంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటూ రాపిడో నడిపే సాయిమనోజ్, శుక్రవారం రాజక్కపల్లిలోని అమ్మమ్మ వద్దకు వచ్చాడు. మరునాడే చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికందిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular