ట్రాక్టర్ బోల్తా.. యువకుడి దుర్మరణం
చెన్నారావుపేట జూన్ 25 ప్రజావాణి
మండలంలోని శంకరం తండాకు చెందిన భూక్య రాజు 24 ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో మృతి చెందాడు. బుధవారం రాత్రి ట్రాక్టర్ ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో శంకరం తండా స్మశాన వాటిక సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన రాజును నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై మృతుడి తండ్రి మోహన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కుమారుడి మరణం పై ఎలాంటి అనుమానం లేవని పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.



