📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliవిద్యార్థుల సౌకర్యం కోసం వాటర్ ఫ్రిజ్ అందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్

విద్యార్థుల సౌకర్యం కోసం వాటర్ ఫ్రిజ్ అందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి// గోదావరిఖని


విద్యార్థుల సౌకర్యం కోసం వాటర్ ఫ్రిజ్ అందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్

రామగుండం మహిళా గురుకుల కళాశాలలో విద్యార్థులకు చల్లని తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో వాటర్ ఫ్రిజ్‌ను అందించారు. గురుకుల పేరెంట్స్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కవ్వంపల్లి సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ తేజస్విని తదితరులు విద్యార్థుల అవసరాన్ని ఎమ్మెల్యే, మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ఫ్రిజ్‌ను ప్రిన్సిపాల్ తేజస్విని, కవ్వంపల్లి సతీష్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ నీటి పైప్‌లైన్, రోడ్డు సౌకర్యం, కుట్టు మిషన్ల పంపిణీ, కళాశాల పరిసరాల పరిశుభ్రత వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టారని పేర్కొన్నారు.

విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు కార్పొరేషన్ ద్వారా వాటర్ ఫ్రిజ్ అందించడం అభినందనీయమని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్ అరుణశ్రీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గురుకుల పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular