📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaజిల్లాలో ఎక్కడా లేని విధంగా దిష్టిబొమ్మల దగ్ధం

జిల్లాలో ఎక్కడా లేని విధంగా
దిష్టిబొమ్మల దగ్ధం

📰 Generate e-Paper Clip

పోటాపోటీగా….

దిష్టిబొమ్మల దగ్ధం

జిల్లాలో ఎక్కడా లేని విధంగా

వేడెక్కిన రాజకీయాలు


నడికూడ,జూన్ (ప్రజావాణి)


పరకాల నియోజకవర్గం నడికూడ మండల కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలతో పాటు దిష్టిబొమ్మలు దగ్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వారి వారి నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుండడంతో మండలంలోఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ చేస్తున్నారు. పోలీసుల ముందే ఈ కార్యక్రమాలను చేస్తూ వారి ఆదేశాలను లెక్కచేయకుండా హింసాత్మక ధోరణి అవలంబిస్తున్నారు.

గత  వారం  రోజుల క్రితం పరకాల నియోజకవర్గం లోని నడికూడ మండలంలో  శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ల పై అనుచిత వాక్యాలు చేశారని బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  దిష్టిబొమ్మను దగ్ధం చేయగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాజీఎమ్మెల్యే  చల్లా ధర్మారెడ్డి ల దిష్టిబొమ్మను దగ్ధం నడి కూడ లో చేశారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల వద్ద కమిషనర్లకు తీసుకుంటూ అక్రమ మైనింగ్ ప్రోత్సహిస్తు మాఫియాకు పాల్పడుతూ లక్ష కొద్ది రూపాయలు సంపాదిస్తున్నారని నడికూడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అవినీతికి పాల్పడితే పాటు మట్టి మాఫియా కమిషన్లకు కొమ్ము కాస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చల్ల ధర్మారెడ్డిల  దిష్టిబొమ్మలు దహనం చేసి భారీ ధర్నా రాష్ట్ర నిర్వహించారు. ఈ ఈ సంఘటనతో పరకాల నియోజకవర్గం లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు అక్కడ ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


అసలే వర్షాకాలం ముందు చేయడంతో బస్సుల రాకపోకలు ఇబ్బంది కలగటం అక్కడ దుకాణ సముదాయాలు సైతం మూసి ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు పార్టీ నాయకులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  దిష్టి బొమ్మలను బిఆర్ఎస్ నాయకులు దగ్ధం చేస్తుంటే బిఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. సమాచారం ముందే పోలీసులకు అందుతున్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఇది పద్దతి కొనసాగితే రాబోయే రోజుల్లో రెండు పార్టీల వారు హింసాత్మక ధోరణికి పాల్పడి   అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాతావరణాన్ని పోలీసులు ఆపవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.