📄 ePaper
Wednesday, June 24, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriచెట్ల కొమ్మల కత్తిరింపు, నిర్వహణ, ఘట్కేసర్ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

చెట్ల కొమ్మల కత్తిరింపు, నిర్వహణ, ఘట్కేసర్ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 22: చెట్ల కొమ్మల కత్తిరింపు, ఫీడర్ నిర్వహణ పనులు మరియు విద్యుత్ లైన్ల క్లియరెన్స్ కార్యక్రమాల నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ చందుపట్లగూడ ఫీడర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎదులాబాద్ గ్రామం, చందుపట్లగూడ గ్రామం, మర్రిపల్లిగూడ గ్రామం, కొత్తగూడ, పోతురాజుగూడ, మేఘా కళాశాల, మదర్ థెరిస్సా కళాశాల, శ్రీరామ పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రాంతాలు,

11 కేవీ ఎదులాబాద్ ఏజీఎల్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎదులాబాద్ ఏజీఎల్, కొత్తగూడ ఏజీఎల్, పోతురాజుగూడ ఏజీఎల్,

నారపల్లి సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ సింగపూర్ సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 11 కేవీ అన్నోజిగూడ ఫీడర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాయి సందీప్ కాలనీ, శ్రీకృష్ణ నగర్, అన్నోజిగూడ పాత గ్రామం, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీ, ఎల్‌ఐజీ కాలనీ, హనుమాన్ నగర్, ఇందిరా నగర్, సాయి నగర్ కాలనీ, సత్యసాయి హౌసింగ్ కాలనీ, సాయి గణేష్ కాలనీ, సాయి గణేష్ ఎన్‌క్లేవ్, సుముకేష్ హైట్స్, ఐఎఫ్‌ఓసిటీ ప్రేమలత గ్రాండ్యూర్,

11 కేవీ ఆర్‌జీకే ఫీడర్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఆర్‌జీకే కాలనీ మొత్తం బ్లాకులు, పీహెచ్‌సీ కాలనీ, డాక్టర్ ప్రకాశ్‌రావు నగర్, ఎమరాల్డ్ పార్క్, ఎమరాల్డ్ హైట్స్, సూర్యనగర్, వెంకటసాయి నగర్, గాయత్రీమాత ఆలయ రహదారి పరిసరాలు, ఆర్‌ఎన్‌ఆర్ హైట్స్, ఆర్‌ఎన్‌ఆర్ విల్లాస్ తదితర ప్రాంతాలు ప్రభావితమవుతాయి.

విద్యుత్ సరఫరా నిలిపివేత సమయంలో వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని అధికారులు సూచించారు. పనుల సందర్భంగా ప్రజలు సహకరించాలని ఘట్‌కేసర్ సెక్షన్ ఇన్‌చార్జి ఏఈ ఎం. ప్రసన్నాంజనేయులు మరియు నారపల్లి ఏఈ హరినాథ్ సాగ్గు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular