కడప జిల్లాజూన్ 22ప్రజావాణి విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ జూనియర్ కళాశాల వద్ద ఏ.ఐ.ఎస్.బి వార్షికోత్సవ పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. సోషలిజం, శాంతి, అభ్యుదయం లక్ష్యాలతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకు 1951 జూన్ 25 న ఏర్పాటు అయిన అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) నాటి నుండి నేటి వరకు విద్యారంగా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పోరేట్ రంగాన్ని పెంచి పోషించేలా అడుగులు ముందుకు వేస్తున్నాయని వారు అన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందన్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే జీవో నెంబర్ 77 ను రద్దు చేస్తాం అని చెప్పిన లోకేష్ నేడు విద్యార్థులకు మొండి చేయి చూపడం దారుణమన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నేటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో పర్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ కొరత, సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.విద్యారంగా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం మరిన్ని పోరాటాలకు అఖిల భారత విద్యార్థి బ్లాక్ సన్నద్ధం కాబోతుందన్నారు. అందులో భాగంగా జూన్ 25న ఏ.ఐ.ఎస్.బి 76వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బినాయకులు అఖిల్, సుమంత్, చింటూ, పండు తదితరులు పాల్గొన్నారు
అఖిల భారత విద్యార్థి బ్లాక్ 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి: – ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు
RELATED ARTICLES

