📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వేంపల్లి శ్రీనివాస స్కూల్ పై చర్యలు తీసుకోవాలి,ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు...

వేంపల్లి శ్రీనివాస స్కూల్ పై చర్యలు తీసుకోవాలి,ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు మోహన్. డిమాండ్

📰 Generate e-Paper Clip

కడప జూన్ 22ప్రజావాణి వేంపల్లి పట్టణంలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి పోరాటాలు చేస్తున్న కూడా పట్టించుకోని ఆర్జెడి కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆర్ ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు గురు మోహన్. మాట్లాడుతూ వేంపల్లి మండలంలో ఉన్న శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ఒకచోట అనుమతుంటే మరొకచోట 3 అంతస్తులు బిల్డింగులు ఒక అపార్ట్మెంట్ లో పాఠశాల నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మూడంతస్తుల బిల్లింగ్ సంబంధించి ఫైర్ ఎన్ఓసి లేకుండానే పాఠశాల నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం. అందులో భాగంగానే శ్రీనివాస పాఠశాలలో పాఠ్యపుస్తకాలు కూడా అంగట్లో పుస్తకాల అమ్మి నెట్టు బడిలో పుస్తకాల అమ్ముతున్నారు. హాస్టల్ కు విద్యాశాఖ అధికారులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వనప్పటికీ మా దగ్గర హాస్టల్ ఉంది. అని చెప్పి హాస్టల్ నిర్వహణ కోసం విద్యార్థుల దగ్గర వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తూ 20 నుంచి 30 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి విద్యార్థులను తమ పాఠశాలలో కు అడ్మిషన్లు చేసుకుంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరు కావున ఒకసారి పరిశీలించి చట్టబద్ధమైన చర్యలు ఆ పాఠశాలపై తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్ యు గా విజ్ఞప్తి చేస్తున్నాము. అందులో భాగంగానే ఆర్ జెడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు చరణ్ కుమార్, సందీప్, ప్రమోద్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.